Guntur Kaaram Trailer: 'గుంటూరు కారం' ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్.. 'సలార్'ను మడతబెట్టి..
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం' విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది. అదివారం రాత్రి విడుదలైన గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డును నెలకోల్పింది. 24 గంటల్లో 39 మిలియన్ల వ్యూస్‌తో అత్యధికంగా వీక్షింంచిన దక్షిణ భారత ట్రైలర్‌గా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. ట్రైలర్ వ్యూస్‌లో సలార్ మూవీ రికార్డును 'గుంటూరు కారం' బ్రేక్ చేసింది. సలార్ మూవీ ట్రైలర్ 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఇప్పుడు ఆ రికార్డును 'గుంటూరు కారం' మడతపెట్టి.. రీజనల్ లెవల్లో మహేష్ బాబును మించినోడు లేడని మరోసారి నిరూపించింది. సలార్ రికార్డును బ్రేక్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.