Annamalai : మహిళల పాత్రలు సరిగ్గా లేవు.. యశ్ 'టాక్సిక్'పై అన్నామలై తీవ్ర విమర్శలు!
ఈ వార్తాకథనం ఏంటి
కోయంబత్తూరులో జరిగిన ఓ బహిరంగ సభలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలై సినిమాల ప్రభావం సమాజంపై ఏ విధంగా ఉంటుందనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన 'టాక్సిక్' సినిమాను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. సినిమా మొదటి రోజే రూ.104 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్న ఆయన.. మహిళలను తప్పుగా చూపించే చిత్రాలు భారీగా డబ్బు సంపాదించడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. "నిన్న ఓ సినిమా గురించి విన్నాను. అది మొదటి రోజే రూ.104 కోట్లు వసూలు చేసింది. మనం ఎప్పుడూ మంచి విషయాలు మాట్లాడాలని చూస్తాం. కానీ ఏకంగా సినిమా పేరునే 'టాక్సిక్' అని పెట్టుకున్నారు.
వివరాలు
సెన్సార్ బోర్డు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలిత
ఈ చిత్రం మహిళలను తప్పుగా చూపిస్తూనే భారీగా డబ్బు సంపాదిస్తోంది" అని అన్నామలై మండిపడ్డారు. ఇలాంటి సినిమాలను విద్యార్థులు, యువత చూస్తే దేశం ఏ దిశగా పయనిస్తుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవైపు నగరాల్లో మహిళల భద్రత గురించి చర్చిస్తున్నామని.. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇలాంటి చిత్రాలకు ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నించారు.
సినిమాల్లో మహిళలను గౌరవించే విధానం ఉండాలని అన్నామలై అన్నారు.
సినిమా సర్టిఫికేషన్ విషయంలో సెన్సార్ బోర్డు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
వివరాలు
హాట్ టాపిక్ గ్గా అన్నామలై వ్యాఖ్యలు
ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'టాక్సిక్' గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించినప్పటికీ.. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు, హింస, మహిళల చిత్రణపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే అన్నామలై చేసిన వ్యాఖ్యలు మరోసారి 'టాక్సిక్' సినిమాపై చర్చకు దారితీశాయి.