
Shruti Haasan: రజనీకాంత్‌తో పని చేయడం ఓ గొప్ప అనుభవం : శృతి హాసన్
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించింది.
సింగర్‌గా కూడా శృతికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తండ్రి పేరు వాడకుండా తన ట్యాలెంట్‌తో స్టార్‌గా ఎదిగింది.
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు నేషనల్ స్థాయిని దాటి ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తోంది.
ఈ క్రమంలో రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కూలీ'. ఇందులో శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది.
Details
ఆసక్తికర విషయాలను పంచుకున్న శృతి
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ సారుతో కలిసి పని చేయడంపై శృతి హాసన్ తన అనుభూతిని పంచుకుంది.
'రజనీకాంత్ వంటి దిగ్గజంతో స్క్రీన్ షేర్ చేయడం నాకు గర్వంగా ఉంది.
అంత పెద్ద స్టార్‌గా ఎలా ఎదిగారో ఆయనతో వర్క్ చేస్తే అర్థమైంది. క్రమశిక్షణ, అంకితభావం, పాత్ర కోసం ఆయన పడే కష్టం చూస్తే ఎంతో నేర్చుకునేలా ఉంటుంది.
సెట్‌లో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయన ఉండటం వల్ల పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరిస్తారు.
Details
కల నెరవేరింది
కూలీలో నా పాత్ర చాలా సింపుల్‌గా ఉండి అందరికీ కనెక్ట్ అవుతుంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పని చేయడం నా కల.. చివరికి అది నెరవేరిందని శృతి హాసన్ పేర్కొంది. ఈ సినిమాపై రజనీకాంత్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
శృతి హాసన్ పాత్ర సింపుల్‌గా ఉన్నా, ఆమె నటన మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.