
OG First Ticket Auction : వామ్మో.. OG ఫస్ట్ టికెట్ వేలం పాటలో సంచలనం.. ఎన్ని లక్షలు పలికిందో అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో బుకింగ్స్ ప్రారంభం కాగా, టికెట్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. అక్కడ ఇప్పటికే 800K డాలర్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డులు సృష్టించింది. ఇవాళ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఈ కలెక్షన్ 1 మిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంటుందనే అంచనాలున్నాయి.
Details
OG నైజాం ఫస్ట్ టికెట్ వేలం
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు, ఫస్ట్ షోల టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. కొన్ని చోట్ల బ్లాక్ టికెట్లుగా కూడా పెద్ద మొత్తంలో అమ్ముతారు. అయితే ఈసారి OG నైజాం ఫస్ట్ టికెట్‌ను ప్రత్యేకంగా వేలం వేయగా, అది భారీ ధరకు అమ్ముడైంది. తాజాగా పవన్ అభిమానులు ట్విట్టర్ స్పేస్ నిర్వహించగా, తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా నుంచి కూడా అనేక మంది పాల్గొన్నారు. ఈ స్పేస్‌లో జరిగిన OG నైజాం ఫస్ట్ టికెట్ వేలంలో ఒక్క టికెట్ ధర ఏకంగా 5 లక్షల రూపాయలు చేరింది.
Details
ఒక్క టికెట్ కోసం రూ.5 లక్షలు
ఆ టికెట్‌ను నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆ 5 లక్షల మొత్తాన్ని జనసేన పార్టీ ఫండ్‌కు విరాళంగా ఇస్తామని, మూడు రోజుల్లో అందజేస్తామని వారు ప్రకటించారు. దీంతో #OGFirstTicketAuction ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఒక్క టికెట్ కోసం 5 లక్షలు వెచ్చించారని విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ మొత్తమంతా జనసేనకు వెళ్తుండటంతో పాటు, పవన్‌పై ఉన్న అభిమానంతోనే ఈ స్థాయిలో కొనుగోలు చేశారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.