Page Loader
టీవీల్లోకి వచ్చేస్తున్న రైటర్ పద్మభూషణ్: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ అవుతుందంటే? 
జీ తెలుగులో ప్రసారం కానున్న రైటర్ పద్మభూషణ్

టీవీల్లోకి వచ్చేస్తున్న రైటర్ పద్మభూషణ్: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ అవుతుందంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
May 25, 2023
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్​ యంగ్​ హీరో సుహాస్, టీనా శిల్పా రాజ్ జంటగా నటించిన రైటర్​ పద్మభూషణ్ సినిమా ఈ వారం వరల్డ్​ టెలివిజన్ ప్రీమియర్‌గా వస్తోంది. అద్భుతమైన కథ, కథనంతో బాక్సాఫీస్​ వద్ద మంచి సినిమాగా నిలిచింది సినిమా రైటర్​ పద్మభూషణ్. ప్రస్తుతం ఈ సినిమా టీవీల్లోకి వచ్చేస్తోంది.​​ మే 28వ తేదీన ఆదివారం సాయంత్రం 6గంటలకు, జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సినిమాలో పద్మభూషణ్​గా సుహాస్​ నటించారు. పద్మభూషణ్​ తన మొదటి పుస్తకం తొలి అడుగును ప్రచురించి అందరిచేత గుర్తించబడాలని కోరుకుంటాడు. అనుకోకుండా వేరే పుస్తకం ద్వారా పద్మభూషణ్​ను అందరూ గొప్ప రచయితగా గుర్తించి అభినందిస్తారు. అయితే, అంతా అనుకున్నట్లు ఆ పుస్తకం రాసింది అతను కాదు.

Details

కొడుకు కోసం అమ్మ పడే తపన రైటర్ పద్మభూషణ్ 

తన పేరుతో ఎవరు పుస్తకం రాశారో తెలుసుకోవాలనుకుంటాడు పద్మభూషణ్. ఇంతకీ ఆ రచయిత ఎవరు? వేరే రచయిత పద్మభూషణ్ పేరును ఎందుకు ఉపయోగించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కామెడీ, సెంటిమెంట్​తో కూడిన ఈ సినిమాలో, సుహాస్​ నటన, కథలో ట్విస్ట్​ అందరి మనసునూ హత్తుకుంటుంది. క్లైమాక్స్​తో అందరినీ కట్టిపడేశాడు దర్శకుడు. రైటర్​ పద్మభూషణ్ సినిమా ప్రతి ఒక్కరికీ తల్లినీ, ఆమె తమకోసం చేసిన త్యాగాలను గుర్తుచేస్తుంది. రైటర్​ అవ్వాలనే కొడుకు కల నెరవేరేందుకు తపన పడే తల్లిగా రోహిణి అందరిచేతా కంటతడి పెట్టిస్తారు. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, గోపరాజు రమణ, ప్రవీణ్ కటారియా సహాయక పాత్రల్లో నటించారు