LOADING...
Emraan Hashmi: యామీ గౌతమ్‌ ప్రొఫెషనల్‌, కానీ కొందరు సెట్స్‌కే రారు.. ఇమ్రాన్‌ హష్మీ హాట్‌ కామెంట్స్!
యామీ గౌతమ్‌ ప్రొఫెషనల్‌, కానీ కొందరు సెట్స్‌కే రారు.. ఇమ్రాన్‌ హష్మీ హాట్‌ కామెంట్స్!

Emraan Hashmi: యామీ గౌతమ్‌ ప్రొఫెషనల్‌, కానీ కొందరు సెట్స్‌కే రారు.. ఇమ్రాన్‌ హష్మీ హాట్‌ కామెంట్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ కలిగిన నటుల్లో ఇమ్రాన్‌ హష్మీ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. తాజాగా పవన్‌ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమాలో విలన్‌గా కనిపించి, టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో ఆయన తెలుగు సినీ పరిశ్రమకు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్న తాజా సినిమా 'Haq', ఇందులో యామీ గౌతమ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉమెన్స్‌ రైట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుపర్ణ్‌ ఎస్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, నవంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Details

బాలీవుడ్ లో పెద్ద చర్చ

ప్రచార కార్యక్రమాల భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ హష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. సెట్స్‌కు సమయానికి హాజరయ్యే విషయంలో యామీ గౌతమ్‌ ప్రొఫెషనలిజమ్‌ను ప్రశంసించిన ఆయన, అదే సమయంలో కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. యాక్టర్లు సమయానికి సెట్స్‌కు రాకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ సమయానికి రావడం మరిచిపోండి.. కొందరు నటులు అయితే సెట్స్‌కే రారంటూ వ్యంగ్యంగా అన్నారు. ఇమ్రాన్‌ హష్మీ ఈ కామెంట్‌ ఎవరిని ఉద్దేశించి చేశాడన్న దానిపై నెట్టింట ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన స్పష్టంగా పేర్లు వెల్లడించకపోయినా, ఈ వ్యాఖ్యలతో బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ హష్మీ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.