
Yash19: యశ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. విడుదల ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కేజీఎఫ్ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యశ్.. ఆ తర్వాత సినిమా ఏంటి అనేది అందరిలో ఆసక్తి పెరిగింది.
లాంగ్ గ్యాప్ తర్వాత యశ్ కొత్త సినిమా అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.
ఈ సినిమాకు మలయాళ డైరక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
యశ్ 19వ సినిమాగా వస్తున్న దీనికి 'టాక్సిక్'(Toxic) అనే టైటిల్ ను ఖారారు చేశారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన యశ్.. 'నువ్వు వెతుకుతున్నది.. నిన్ను కోరుకుంటోంది' అనే క్యాప్షన్ రాశారు.
ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ సినిమాలో సాయి పల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యశ్ కొత్త సినిమా టైటిల్ ఇదే
'What you seek is seeking you' - Rumi
— Yash (@TheNameIsYash) December 8, 2023
A Fairy Tale for Grown-ups
#TOXIChttps://t.co/0G03Qjb3zc@KvnProductions #GeetuMohandas