LOADING...
Toxic : 'టాక్సిక్‌'లో రొమాన్స్‌పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
'టాక్సిక్‌'లో రొమాన్స్‌పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Toxic : 'టాక్సిక్‌'లో రొమాన్స్‌పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 25, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టాక్సిక్' (Toxic). ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాగా సినిమాకాన్ వేడుకలో పాల్గొన్న యశ్, 'టాక్సిక్'లోని కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ యాక్షన్ చిత్రాన్ని మహిళా దర్శకురాలు తెరకెక్కించడం వల్ల ఇది కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు. అదే సమయంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌పై ప్రశంసలు కురిపించారు.

వివరాలు

భారీగా యాక్షన్  ఎపిసోడ్స్..

యశ్ మాట్లాడుతూ, సాధారణంగా గ్యాంగ్‌స్టర్ డ్రామాలను పురుష దర్శకులే బాగా తెరకెక్కిస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుందని అన్నారు. అయితే, అదే కథను మహిళా దృష్టికోణంలో చూపించడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ వరకు ప్రతి అంశంలోనూ గీతూ ఆలోచన ఎంతో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. సున్నితమైన భావోద్వేగాలను ఎంత అందంగా చూపించారో, యాక్షన్ సన్నివేశాలను కూడా అదే స్థాయిలో అద్భుతంగా తెరకెక్కించారని యశ్ కొనియాడారు. అన్ని రకాల భావాలను ఒక మహిళా దర్శకురాలు ఇంత సమర్థంగా చూపించగలరని ఆమెతో కలిసి పనిచేసిన తర్వాతే తనకు తెలిసిందన్నారు.

Advertisement