
Yash: కోర్టులో యశ్, రాధిక పండిట్.. అసలు విషయం ఏమిటంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల సెలబ్రిటీలు కోర్టుకు వెళ్లడం సాధారణమైపోయింది. కానీ ఈ సారి యష్, రాధిక కోర్టు మెట్లెక్కడం వారి నిజజీవితానికి సంబంధించినది కాదు.
ఒక వాణిజ్య ప్రకటనలో భాగంగా వారు ఈ తరహాలో కనిపించారు. యష్ లాయర్ గెటప్‌లో కనిపిస్తుండగా, కోర్టులో రాధికా పండిట్ తన పాత్రను పోషిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ప్రకటనలో రాధికా పండిట్ మోసానికి గురైన కస్టమర్‌గా నటిస్తుండగా, ఆమెకు న్యాయం అందించే లాయర్ పాత్రలో యష్ కనిపించారు.
కంపెనీ వంట నూనె ఖచ్చితంగా స్వచ్ఛమైనదని నిరూపించేందుకు యష్ తన వాదనలను ప్రదర్శించడం గమనార్హం.
Details
ఈ ప్రకటనను ఆదరిస్తున్న యష్ అభిమానులు
ఈ ప్రకటనకు యష్-రాధిక జంటను అభిమానులు బాగా ఆదరించారు.
ప్రస్తుతం యష్‌కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆయన తన జీవిత భాగస్వామి రాధిక గురించి ఎప్పుడూ ప్రేమతో, గౌరవంతో మాట్లాడుతూ ఉంటాడు.
ప్రతి ఇంటర్వ్యూలో తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా, తమ బంధానికి సంబంధించిన విషయాలను ఆనందంతో పంచుకుంటాడు.