Toxic: యశ్ 'టాక్సిక్' మూవీ వాయిదా.. రిలీజ్ డేట్ మారింది! కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
యశ్(Yash) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic Movie) ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్తానికి గీతూ మోహన్‌దాస్(Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్నారు. 'ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్' అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మితమవుతోంది. అయితే ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. మొదట ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విడుదల తేదీని జూన్ 4కు మార్చినట్లు వెల్లడించారు.
వివరాలు
ఐదుగురు హీరోయిన్లతో ప్రత్యేక ఆకర్షణ
"'టాక్సిక్' చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌లో కూడా విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం సరైన నిర్ణయం కాదని భావించాం. అందుకే రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం" అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇక ఇందులో యశ్‌తో పాటు అయిదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ఎలిజిబెత్‌గా, నయనతార (Nayanthara) గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.