
యాత్ర 2 ఫస్ట్ లుక్: వైయస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
2019 ఎలక్షన్లకు ముందు రిలీజైన యాత్ర సినిమా మంచి విజయాన్ని సాధించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన కథతో ఈ సినిమా వచ్చింది.
ప్రస్తుతం యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2 రాబోతుంది. ఈ సినిమాలో వైయస్సార్ మరణం, ఆ తర్వాత జగన్ ఎదుర్కొన్న పరిస్థితులు, సీఎం గా జగన్ మారిన తీరు ఉండబోతుంది.
తాజాగా యాత్ర 2 ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కనిపిస్తున్నారు.
అలాగే వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాత్ర 2 సినిమా 2024 ఫిబ్రవరి 8వ తేదీన విడుదలవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యాత్ర 2 దర్శకుడి ట్వీట్
In the shadow of a legend, A leader rises!
— Mahi Vraghav (@MahiVraghav) October 9, 2023
Presenting the first look of #Yatra2. In cinemas from 8th Feb, 2024.#Yatra2FL #Yatra2OnFeb8th #LegacyLivesOn @mammukka @JiivaOfficial @ShivaMeka @vcelluloidsoff @KetakiNarayan @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/doygY3BBTC