Om Shanthi Disco Shanthi : 'యాత్ర' దర్శకుడి కొత్త సినిమా.. 'ఓం శాంతి డిస్కో శాంతి' అనౌన్స్
ఈ వార్తాకథనం ఏంటి
'యాత్ర', 'ఆనందో బ్రహ్మ', 'సేవ్ ది టైగర్స్' వంటి సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లతో గుర్తింపు పొందిన దర్శక-నిర్మాత మహి వి. రాఘవ్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి రచయితగా, షో రన్నర్‌గా 'ఓం శాంతి డిస్కో శాంతి' అనే కామెడీ హారర్ సినిమాను తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను 'ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ' అనే సరదా క్యాప్షన్‌తో విడుదల చేశారు. ఇప్పటివరకు మనుషులను భయపెట్టిన దెయ్యాలు... ఇప్పుడు అవే భయపడే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందన్న వినూత్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
వివరాలు
సెప్టెంబర్ 4న రిలీజ్
భయమే తెలియని పిచ్చివాళ్లు దెయ్యాల ముందు నిలిస్తే, దెయ్యాలు వర్సెస్ పిచ్చివాళ్లు మధ్య జరిగే గందరగోళమైన ఫన్ రైడ్‌గా ఈ సినిమా ఉండబోతోందని మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై శివ మేక, సాహితీ చింతలపూడి నిర్మిస్తున్న ఈ సినిమాకు గోగు ఆర్. ఆర్. దర్శకత్వం వహిస్తున్నారు. కథ, రచనను మాహి వి. రాఘవ్ అందిస్తున్నారు.