LOADING...
Mega Victory Mass song: 'ఏందీ బాసు.. ఇరగదీద్దాం సంక్రాంతి' - మెగా విక్టరీ మాస్ సాంగ్‌ రిలీజ్! 

Mega Victory Mass song: 'ఏందీ బాసు.. ఇరగదీద్దాం సంక్రాంతి' - మెగా విక్టరీ మాస్ సాంగ్‌ రిలీజ్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మొదటిసారిగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'పై అభిమానుల్లో భారీ ఎక్సైట్‌మెంట్ మొదలైంది. చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్**గా 'మెగా విక్టరీ మాస్' ఈ రోజు అధికారికంగా రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్ స్టైలిష్ పబ్ సెట్టింగ్‌లో ఎంట్రీ ఇచ్చి, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్‌తో మాస్ ఫ్యాన్‌స్‌ని అదరగొట్టారు. స్క్రీన్‌పై మెగా-విక్టరీ కాంబినేషన్ తొలిసారి కనబడటంతో అభిమానుల ఉత్సాహం పీక్స్‌లోకి చేరింది. సంగీత దర్శకుడు భీంస్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

Details

 హీరోయిన్‌గా నయనతార 

తాజాగా విడుదలైన లిరికల్ వీడియోలో 'ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ..' వంటి హుషారైన లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్ రాశారు. సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. హీరోగా చిరంజీవి, హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. అలాగే, హీరో విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఎక్స్‌టెండెడ్ కేమియోలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 2026ని సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Advertisement