LOADING...
Sachin Chandwade: బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య
బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య

Sachin Chandwade: బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ పరిశ్రమలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. 'జమ్తారా 2' వెబ్‌సిరీస్‌తో పేరుపొందిన యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన అక్టోబర్ 23న జరిగినప్పటికీ, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చాలా చిన్న వయసులోనే ఆయన బలవన్మరణం పాల్పడడం సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మహారాష్ట్రలోని ఉందిర్‌ఖేడ్ ప్రాంతంలో తన నివాసంలో సచిన్ అక్టోబర్ 23న ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఘటన గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Details

'జమ్తారా 2'తో మంచి గుర్తింపు 

అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఆయన పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ప్రాణాలు విడిచాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ ప్రారంభించిన సచిన్, నటనపై ఉన్న మక్కువతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. 'జమ్తారా 2'లో నటించి మంచి గుర్తింపు పొందాడు. కెరీర్‌లో ఎదుగుతున్న ఈ దశలో సచిన్ ఇంతటి తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆయన ఆత్మహత్య వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సచిన్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు బాలీవుడ్‌ వర్గాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.