 
                                                                                Vishal: యంగ్ హీరో విశాల్ డైరెక్టర్‌గా ఎంట్రీ… సక్సెస్ సాధిస్తాడా?
ఈ వార్తాకథనం ఏంటి
రవి అరసు దర్శకత్వంలో, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై గ్రాండ్‌గా ప్రారంభమైన సినిమా 'మకుటం'. పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. విశాల్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే నెల కాకముందే ఈ ప్రాజెక్ట్‌లో ఓ కీలక మలుపు వచ్చింది. దర్శకుడు రవి అరసుతో హీరో విశాల్‌కు క్రియేటివ్ క్లాష్ తలెత్తిందనే వార్తలు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయ్యాయి. దాంతో 'ఇకపై నేనే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తానని విశాల్ నిర్ణయం తీసుకున్నాడు. దీపావళి సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేస్తూ, 'ఇది నేను ఊహించలేదు కానీ పరిస్థితులు నన్ను ఈ నిర్ణయానికి నడిపించాయి. ఇకపై 'మకుటం' చిత్రానికి నేను దర్శకుడిగానూ వ్యవహరిస్తానని ప్రకటించాడు విశాల్.
Details
బడ్జెట్ పెట్టలేని నిర్మాతలు సినిమాలు చేయొద్దు
ఇలాంటి పరిస్థితి విశాల్ కెరీర్‌లో ఇదే మొదటిసారి కాదు. గతంలో మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తుప్పరి వాలన్' సినిమా విజయవంతమైంది. కానీ దాని సీక్వెల్ 'తుప్పరి వాలన్ 2 (తెలుగులో 'డిటెక్టివ్') సమయంలో మిస్కిన్ ప్రవర్తన కారణంగా లండన్‌లో ఒంటరిగా బాధపడ్డానని విశాల్ భావోద్వేగంగా చెప్పుకున్నాడు. అప్పుడే ఆయన వర్క్‌పై ఉన్న డెడికేషన్ ఫ్యాన్స్‌కి స్పష్టమైంది. ఇప్పుడు అదే నిబద్ధతతో 'మకుటం' ప్రాజెక్ట్‌ను కాపాడాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారినట్టు చెబుతున్నారు. అంతేకాదు, ఇటీవలే బడ్జెట్ పెట్టలేని నిర్మాతలు సినిమాలు చేయొద్దు. ఒకవేళ చేస్తే రిటర్న్స్ ఆశించకూడదు.
Details
దర్శకుడిగా ప్రతిభను నిరూపించేందుకు సిద్ధమైన విశాల్
ఆ డబ్బు భూమి మీద పెట్టుబడిగా పెడితేనే మేలని వ్యాఖ్యలతో చిన్న సినిమాల నిర్మాతలపై చేసిన కామెంట్స్ కారణంగా విశాల్ వివాదాల్లో చిక్కుకున్నాడు. అయినప్పటికీ, ఈసారి ఆయన తీసుకున్న డైరెక్షన్ నిర్ణయాన్ని ఇండస్ట్రీలో చాలా మంది బోల్డ్ మూవ్‌గా చూస్తున్నారు. హీరోగా, నిర్మాతగా, ఇప్పుడు దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకునే దిశగా విశాల్ అడుగులు వేస్తున్నాడు. మరి 'మకుటం'తో డైరెక్టర్‌గా కూడా విజయాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.