తదుపరి వార్తా కథనం

Music Director: ప్రముఖ సంగీత స్వరకర్త కన్నుమూత
వ్రాసిన వారు
Sirish Praharaju
May 02, 2024
04:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ జాండిస్ కు చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఎల్టీటిఈ అధినేత ప్రభాకరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మెథాకు'చిత్రానికి ప్రవీణ్ సంగీతం అందించారు.
2021లో ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ చిత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
మేకింగ్,స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా పాటలు,నేపధ్య సంగీతం కూడా సినిమాకు బలాన్నిచ్చాయి.
అదే విధంగా రాకథాన్ చిత్రానికి ప్రవీణ్ కుమార్ సంగీతం అందించారు.
ప్రవీణ్ కుమార్ ఎన్నో సవాళ్లను అధిగమించి తమిళ చిత్రసీమలో సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన స్వగ్రామం తంజావూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
28 ఏళ్ళ వయస్సులో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి
இளம் இசையமைப்பாளர் பிரவீண் குமார் மரணம் #Praveenkumar #Musicdirectorpraveenkumar https://t.co/Uurps6vcdC
— Dinamalar Cinema (@dinamalarcinema) May 2, 2024