
Suresh Sangaiah: తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.
లివర్ సమస్య కారణంగా ఆయన మరణించినట్లు అతని స్నేహితుడు, సినిమాటోగ్రాఫర్ శరణ్ ధ్రువీకరించారు.
సురేశ్ సంగయ్య 2017లో 'ఒరు కిడైయిన్ కరు మను' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
అతని కథన శైలి, సినిమాటిక్ అప్లోచ్ విమర్శకుల ప్రశంసలు పొందాయి. 2022లో విడుదలైన 'సత్య సొతనై' సినిమా ద్వారా మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు.
అతి త్వరలోనే ఓటీటీ కోసం కమెడియన్ యోగి బాబుతో కలిసి రూపొందించిన సినిమా కూడా సురేష్ కెరీర్‌లో ముఖ్యమైంది.
Details
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళ సినీ పరిశ్రమ
గత కొద్దికాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్న సురేశ్ ఆరోగ్యం శుక్రవారం మరింత క్షీణించింది. దీంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేశ్ మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
సురేశ్ మరణం వార్త తెలిసిన సినీ ప్రముఖులు అతనితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.