LOADING...
YVS : ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరికి మాతృవియోగం
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరికి మాతృవియోగం

YVS : ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరికి మాతృవియోగం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి రత్నకుమారి(88) మరణించారు.గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్‌ చౌదరి తెలిపారు. అమ్మతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నోట్‌ విడుదల చేశారు. లారీ డ్రైవర్‌ అయిన మా నాన్న యలమంచిలి నారాయణరావు నెలవారీ సంపాదనతో అమ్మ మా ముగ్గురినీ పెంచి పెద్ద చేసింది.మా ముగ్గురు పిల్లలను పెంచడానికి అవసరమైన ఆహారం,దుస్తులు, ఇంటి అద్దె,విద్య,వైద్య సేవలతో పాటు సినిమాలు చూపించడం,దేవాలయ దర్శనాలు, సీజనల్ వంటలు, పండుగ సందర్భాల్లో ప్రత్యేక వంటకాలు.సెలెబ్రేషన్ల కోసం మొత్తం తన నోటి మీది లెక్కలతో బడ్జెట్‌ని కేటాయించేది. అలాంటి ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మ''

వివరాలు 

ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది

"వీటన్నింటికీ మించి, ప్రతీ రోజూ తెల్లవారుజామున లేస్తూ, పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా పెరుగుదలకు అంకితం చేసినది మా అమ్మ. ఆ జీవన విధానం, ప్రేమ, కృషి కట్టుబాటుతో మేము పొందిన జ్ఞానం ఏ పాఠశాలా, ఏ పుస్తకం చెప్పలేని ప్రత్యేకం. ఆమె జీవిత విధానంలో మాకు ఆత్మీయమైన స్ఫూర్తి నింపిన మహనీయురాలు ఆమె" అంటూ తల్లిని గుర్తుచేసుకున్నారు.