Andhra news: తాడేపల్లిగూడెంలో కోడిపందేల హవా.. సంక్రాంతి రెండో రోజున కోట్ల రూపాయల చేతులు మార్పు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 15, 2026
05:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో కోడిపందేలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ రెండో రోజున కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు సమాచారం. పైబోయిన వెంకటరామయ్య బరిలో భారీ స్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పందెం సాగింది. ఈ పోరులో విజయం సాధించిన రాజమండ్రి రమేష్ మొత్తం రూ.1.53 కోట్లను సొంతం చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడాది జరిగిన కోడిపందేలలో ఇదే అతిపెద్ద పందెమని స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సమయం, జాతకం, ముహూర్తం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పందెం రాయుళ్లు తమ కోళ్లను బరిలోకి దింపుతున్నారని తెలుస్తోంది.