LOADING...
Stone Mine Collapse: సోన్‌భద్రలో కుప్పకూలిన క్వారీ: ఒకరు మృతి,శిథిలాల కింద15 మంది కార్మికులు   
ఒకరు మృతి,శిథిలాల కింద15 మంది కార్మికులు

Stone Mine Collapse: సోన్‌భద్రలో కుప్పకూలిన క్వారీ: ఒకరు మృతి,శిథిలాల కింద15 మంది కార్మికులు   

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో శనివారం రాత్రి తీవ్ర విషాదం జరిగింది. ఓబ్రా పరిధిలో ఉన్న బిల్లీ మార్కుండి రాతి గనిలో అకస్మాత్తుగా ఒక భాగం జారిపడి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఇంకా దాదాపు 15 మంది కార్మికులు కూలిన మట్టి-రాళ్ల కింద చిక్కుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో వెంటనే రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. శిథిలాల నుంచి కార్మికులను బయటకు తీశేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయంగా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని బయటకు తీసినట్టు సమాచారం.

వివరాలు 

పరిస్థితిని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

క్వారీలో గోడలాంటి భాగం కూలిపోవడంతో కార్మికులు అడ్డంగా చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. కొందరు పూర్తిగా శిథిలాల కింద పూడుకుపోయి ఉండచ్చని అనుమానం వ్యక్తమైంది. ప్రమాద వార్త అందిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా పలువురు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అదనపు యంత్రాలు, రక్షణ కోసం అవసరమైన సామాగ్రిని అత్యవసరంగా అక్కడికి పంపినట్టు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సోన్‌భద్రలో కుప్పకూలిన క్వారీ