LOADING...
Jaipur: జైపూర్‌లో ఘోర విషాదం.. ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం..10మంది మృతి
జైపూర్‌లో ఘోర విషాదం.. ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం..10మంది మృతి

Jaipur: జైపూర్‌లో ఘోర విషాదం.. ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం..10మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని జైపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ డంపర్‌ ట్రక్‌ డ్రైవర్‌ అదుపు కోల్పోవడంతో జైపూర్‌లోని లోహమండి రోడ్డుపై సుమారు ఐదు కిలోమీటర్ల మేర విధ్వంసం సృష్టించాడు. ట్రక్‌ అదుపు తప్పి వరుసగా పలు వాహనాలను ఢీకొట్టడంతో ఘోర సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు 

పోలీసుల అదుపులో ట్రక్‌ డ్రైవర్

సాక్షుల ప్రకారం, మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయిన ట్రక్కు డ్రైవర్‌ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర అనేక వాహనాలను ఢీకొంటూ వెళ్లినట్లు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రక్షణ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. రోడ్డుపై వాహనాల శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉన్నారని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement