Page Loader
Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి 
Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి

Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి 

వ్రాసిన వారు Stalin
Mar 31, 2024
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పదేళ్ల బాలిక పుట్టినరోజు కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. అమ్మాయి పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న బేకరీ నుంచి కేక్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో కేక్ కట్ చేసి తిన్న వెంటనే సదరు బాలిక చనిపోయిందని కుటుంబం ఆరోపిస్తోంది. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఓ బేకరీ నుంచి ఆన్‌లైన్‌లో కేక్‌ ఆర్డర్‌ చేశారు. సాయంత్రం 7 గంటలకు కేక్‌ కట్‌ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు.

cake

కేక్ తయారీదారులపై ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలి 

అనంతరం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చిన్నారులు వాంతులు చేసుకోవడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు మాన్వి తాత తెలిపారు. ఆసుపత్రిలో మాన్వి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మాన్వి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేక్ తయారు చేసిన వారిపై ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు.