తదుపరి వార్తా కథనం

దేశంలో కొత్తగా 11,692 మందికి కరోనా; 28 మరణాలు
వ్రాసిన వారు
Stalin
Apr 21, 2023
10:28 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గత 24గంటల్లో 11,692 కరోనా కొత్త కేసులు నమైదనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
కొత్త కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసులు 66,170కి పెరిగాయి.
అలాగే ఒక్క రోజులోనే 28 మంది కోవిడ్‌తో మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,258కి పెరిగింది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,69,684)కు చేరినట్లు కేంద్రం పేర్కొంది.
కరోనా
మరణాల రేటు 1.18 శాతం
ప్రస్తుతంక్రియాశీల కేసులు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.15 శాతంగా ఉన్నాయి.
జాతీయ కరోనా రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,72,256కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ డోస్‌లు వేసినట్లు కేంద్రం పేర్కొంది.