దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు
ఈ వార్తాకథనం ఏంటి
12 చిరుతలతో దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది.
గతేడాది నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకొచ్చిన కేంద్రం, తాజాగా మరో 12 చిరుతలను తీసుకొచ్చింది.
ఆ చిరుతలను ప్రత్యేక హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్‌కు తరలించనున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కునో నేషనల్ పార్క్‌లోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలోకి తొలుత ఆ చిరుతలను విడుదల చేయనున్నారు.
కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఏడు మగ, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి.
దేశంలో అంతరించిపోయిన చిరుతల సంఖ్యను పెంచాలని కేంద్రం మూడేళ్ల క్రితం నిర్ణయించింది. అందులో భాగంగానే దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చారు.
చిరుత
భారత్‌లో 1947లో మరణించిన చివరి చీతా
కునో నేషనల్ పార్క్‌లో 10 క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ వన్యప్రాణుల చట్టాల ప్రకారం, విదేశాల నుంచి దేశంలోకి వచ్చిన జంతువులను 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. అందులో భాగంగానే ప్రస్తుతం తీసుకొచ్చిన చిరుతలను క్వారంటైన్‌లో ఉంచనున్నారు.
భారత్‌లో 1947లో చివరి చిరుత మరణించింది. 1952లో దేశంలో ఈ జాతి అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం ప్రకటించబడింది.
2020లో ఉపజాతులైన ఆఫ్రికన్ చిరుతలను దేశంలోకి తీసుకురావచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జంతువులను తిరిగి దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.