Private Universities: ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా కింద 13,610 ఇంజినీరింగ్ సీట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా కింద ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను విడుదల చేసింది. బ్రౌన్‌ఫీల్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల విషయంలో, అవి విశ్వవిద్యాలయాలుగా మారకముందు కళాశాలలుగా ఉన్న సమయంలో ఉన్న సీట్లలో 70 శాతం, విశ్వవిద్యాలయాలుగా మారిన అనంతరం పెరిగిన సీట్లలో 35 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గ్రీన్‌ఫీల్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మొత్తం సీట్లలో 35 శాతం కన్వీనర్ కోటాకు కేటాయించనున్నారు.
వివరాలు
ఈ కోటా ద్వారా ప్రవేశం పొందే విద్యార్థులు.. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాలి
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 11 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మొత్తం 13,610 ఇంజినీరింగ్ సీట్లు కన్వీనర్ కోటా ద్వారా భర్తీ కానున్నాయి.
వీటిలో విట్‌లో 1,814, సెంచూరియన్‌లో 273, బెస్ట్‌లో 1,134, అపోలోలో 273, మోహన్‌బాబు విశ్వవిద్యాలయంలో 1,519, అన్నమాచార్యలో 1,554, గోదావరి గ్లోబల్‌లో 1,324, ఆదిత్యలో 1,849, వీవీఐటీలో 2,240, ఎస్‌ఆర్‌ఎంలో 1,450, శ్రీ సిటీ ఇంటర్నేషనల్‌లో 180 సీట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆమోదం పొందిన ఈ సీట్లన్నింటినీ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేర్చారు.
కన్వీనర్ కోటా ద్వారా ప్రవేశం పొందే విద్యార్థులు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థుల తరఫున ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది.