Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది.
పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ప్రత్యేకంగా 144 సంవత్సరాల తర్వాత జరగనుంది. సాధారణంగా ప్రతి ఆరుసంవత్సరాలకోసారి అర్ధ కుంభమేళా, 12 సంవత్సరాలకోసారి కుంభమేళా నిర్వహించడం అనవాయితీ.
కానీ ఈ సారి మహా కుంభమేళా 144 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నారు. ఈ మహా కుంభమేళా మరింత ప్రత్యేకంగా ఉండనుంది.
ఎందుకంటే ఇది ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో కాకుండా. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దాదాపు 45 రోజుల పాటు కొనసాగుతుంది.
40 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేసింది.
Details
1,176 సీసీ కెమెరాలు ఏర్పాటు
భారతదేశం సహా, వివిధ దేశాల నుండి భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు, పర్యాటకులు చేరుకునేందుకు భారతీయ రైల్వే ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేసింది.
వారి ప్రయాణానికి సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని తొమ్మిది స్టేషన్లలో రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం 1,176 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం 12 భాషల్లో ప్రకటన వ్యవస్థను ఏర్పాటు చేశారు. కుంభమేళా సమయంలో 10,000 సాధారణ రైళ్లతో పాటు 3,134 ప్రత్యేక రైళ్లను నడిపిస్తారు.
ఇది గత కుంభమేళా కంటే 4.5 రెట్లు ఎక్కువ. 1,896 రైళ్లు స్వల్ప దూరాలకు, 706 రైళ్లు దూర ప్రాంతాలకు, 559 రింగ్ ట్రైన్స్ నడపనున్నారు.