తదుపరి వార్తా కథనం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
వ్రాసిన వారు
Stalin
Sep 10, 2023
07:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
చంద్రబాబు, సీఐడీ తరఫున వాదనలు విన్న ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు తీర్పు ఈ మేరకు తీర్పును వెలువరించారు.
తీర్పు నేపథ్యంలో కోర్టు వెలుపల టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
చంద్రబాబును జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం రాజమండ్రి జైలుకు తరలించనున్న నేపథ్యంలో విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు.
చంద్రబాబును జైలుకు తీసుకెళ్లడానికి కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజమండ్రి జైలుకు చంద్రబాబు తరలింపు
చంద్రబాబుకు రిమాండ్. రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు. 14 రోజులు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.#BreakingNews #ChandrababuArrest
— NTV Breaking News (@NTVJustIn) September 10, 2023