LOADING...
Global Heat Risk: అతి తీవ్ర ఉష్ణోగ్రతల ముప్పు.. టాప్-50లో భారత్‌కు చెందిన 14 నగరాలు
అతి తీవ్ర ఉష్ణోగ్రతల ముప్పు.. టాప్-50లో భారత్‌కు చెందిన 14 నగరాలు

Global Heat Risk: అతి తీవ్ర ఉష్ణోగ్రతల ముప్పు.. టాప్-50లో భారత్‌కు చెందిన 14 నగరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావానికి అత్యధికంగా గురయ్యే 205 నగరాలపై నిర్వహించిన అధ్యయనంలో భారత్‌కు చెందిన నగరాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. సస్టైనబుల్ సిటీస్ అండ్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన నివేదిక ప్రకారం.. అత్యధిక వేడి ముప్పు ఎదుర్కొంటున్న తొలి 50 నగరాల్లో భారత్, పాకిస్థాన్, నైజీరియా, ఘనా దేశాల నగరాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలో ఇరాక్‌కు చెందిన అల్ బస్రా నగరం అత్యధిక వేడి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న నగరంగా మొదటి స్థానంలో నిలిచింది.

వివరాలు 

14 నగరాలు ఇవే . . 

దాని తర్వాతి స్థానంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నిలవడం గమనార్హం. మరోవైపు, అత్యధిక ఉష్ణోగ్రతల ముప్పు ఉన్న తొలి 50 నగరాల్లో ఏకంగా 14 నగరాలు భారత్‌లోనే ఉండటం ఆందోళన కలిగించే అంశంగా అధ్యయనం పేర్కొంది. ఈ జాబితాలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పుణే, తమిళనాడులోని మదురై, చెన్నై, కర్ణాటక రాజధాని బెంగళూరు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లఖ్‌నవూ, కాన్పూర్ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి.

Advertisement