
Madhya Pradesh:మధ్యప్రదేశ్‌లో దీపావళి వేళ విషాదం.. దేశీ బాణాసంచా తుపాకీ వల్ల కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్బైడ్ గన్స్‌తో ఆడుకుంటూ 14 మంది చిన్నారులు కంటిచూపు కోల్పోయారు, వందల మంది గాయపడి ఆస్పత్రులకు చేరుకున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పిల్లలు గాయపడగా విదిష జిల్లాల్లో ఎక్కువమంది గాయపడ్డారు. పండుగ జరుపుకున్న మూడు రోజుల్లో, భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్‌లోని ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి.
వివరాలు
72 గంటల్లోనే 26 మంది చిన్నారులు
భోపాల్‌లోని హమీడియా ఆసుపత్రి 72 గంటల్లోనే 26 మంది చిన్నారులు చేరినట్టు తెలుస్తోంది. కార్బైడ్ గన్స్ అంటే దేశీయంగా తయారు చేసే, ప్లాస్టిక్ పైపుల్లతో రూపొందించే బాణాసంచా తుపాకీ. వీటిలో గన్ పౌడర్, అల్గిపుల్ల మందు, కాల్షియం కార్బైడ్ వంటి పదార్థాలను నింపి తయారు చేస్తారు. కానీ యథేచ్చగా అమ్మడం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చాలా మంది కొనుగోలు చేశారు. తక్కువ ధరకే ఎక్కువ శబ్దం ఇచ్చే కారణంగా, ఈ గన్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. వైద్యులు వీటిని ప్రాణాంతకంగా వర్ణిస్తూ హెచ్చరిస్తున్నారు.