Page Loader
యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య
యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక

యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య

వ్రాసిన వారు Stalin
Mar 06, 2023
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి ఇంట్లో బిడ్డను ప్రసవించింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని అంబజారి ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికకు తాను గర్భం దాల్చినట్లు తెలిసింది. కడుపులో బిడ్డ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చిన శరీర మార్పుల గురించి తల్లి అడిగితే అవి ఆరోగ్య సమస్యలని బాలిక చెప్పింది. తల్లికి మాత్రం గర్భం గురించి చెప్పలేదు.

మహారాష్ట్ర

బాలిక దర్వా విషయం వెలుగులోకి..

బాలిక ఇంట్లో తల్లిలేని సమయంలో ఇంట్లోనే ఎలా ప్రసవించాలనే దానిపై యూట్యూబ్‌లో వీడియోలను చూడటం ప్రారంభించింది. మార్చి 2న తల్లి లేని చూసి యూట్యూబ్ వీడియో ఆధారంగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. వెంటనే నవజాత శిశువును గొంతు కోసి చంపింది. మృతదేహాన్ని ఒక పెట్టెలో దాచిపెట్టింది. తల్లి ఇంటికి తిరిగి రాగానే ఆ తన కూతురు నీరసంగా ఉంటడంతోపాటు రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో బాలిక ఆరోగ్య పరిస్థితిపై తల్లి ఆరా తీసింది. అనంతరం తల్లి అసలు విషయం ఆ బాలిక చెప్పేసింది. ఆ తర్వాత తల్లి ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత పోలీసులకు తల్లి జరిగిన విషయం చెప్పేసింది. పోలీసులు కేసునమోదు చేసుకొని శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.