
Dinosaur fossil: 150 మిలియన్ ఏళ్ల ప్రాచీన డైనోసార్ శిలాజం.. రూ.263 కోట్లకు వేలం
ఈ వార్తాకథనం ఏంటి
కొంతమంది అరుదైన వస్తువుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవలి ఉదాహరణగా, 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ శిలాజం ఒకటి ఏకంగా 30.5 మిలియన్ డాలర్లకి (భారత కరెన్సీలో సుమారు రూ.263 కోట్లు) విక్రయమైంది. ఈ వేలం న్యూయార్క్‌లోని సోథిబే వేలం సంస్థ (Sotheby's Auction House) నిర్వహించింది. ఈ శిలాజం ప్రపంచంలో ఇప్పటివరకు వేలం దక్కిన మూడో అత్యంత ఖరీదైన డైనోసార్ అస్థిపంజరంగా గుర్తింపు పొందింది. గత ఏడాది జులైలో జరిగిన మరో వేలంలో 'అపెక్స్' అనే డైనోసార్ శిలాజం 44.6 మిలియన్ డాలర్లు (రూ.380 కోట్లు) పలికిన సంగతి తెలిసిందే.
Details
150 మిలియన్ సంవత్సరాల కిందట ప్రాచీనమైనది
ఈసారి వేలంలో ఈ శిలాజాన్ని ఎవరీ కొనుగోలు చేశారన్న వివరాలను భద్రతా కారణాల వల్ల సోథిబే సంస్థ గోప్యంగా ఉంచింది. శిలాజం ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సుమారు 150 మిలియన్ సంవత్సరాల ప్రాచీనదైనదని నిర్వాహకులు వెల్లడించారు. ఇదే వేలంలో అంగారక గ్రహం నుంచి వచ్చిన ఓ పెద్ద రాయి కూడా ప్రదర్శనకు పెట్టారు. దానికి గాను భారీ పోటీ నెలకొనగా, చివరకు అది 5.3 మిలియన్ డాలర్లు (సుమారు రూ.45 కోట్లు) ధర పలికింది. అరుదైన, చారిత్రక విలువ కలిగిన వస్తువుల కోసం ప్రియమైన ధరలకైనా వెనుకాడని వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారనడానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.