Vandemataram: 150 ఏళ్ల వందేమాతరం.. నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ గీతం"వందేమాతరం" 150వ వార్షికోత్సవాన్ని గుర్తిస్తూ ఏడాది పాటు జరిగే స్మారక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభారంభం చేశారు. ఈ సందర్భంగా, వందేమాతరం స్మారకార్థంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంపు, జ్ఞాపక నాణెాన్ని కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. అదేవిధంగా, వందేమాతరం 150 సంవత్సరాల స్మారకానికి ప్రత్యేకంగా రూపొందించిన ఒక అధికారిక పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రధాన కార్యక్రమంతోపాటు సమాజంలోని అన్ని వర్గాల పౌరుల భాగస్వామ్యంతో బహిరంగ ప్రదేశాలలో "వందేమాతరం" పూర్తి వెర్షన్‌ను సామూహికంగా పాడారు. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సామూహిక గానంలో ప్రధాని మోదీ స్వయంగా కూడా పాల్గొన్నారు.
వివరాలు
150 సంవత్సరాల వందేమాతరం
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా హాజరయ్యారు. నవంబర్ 7, 2025 నుంచి నవంబర్ 7, 2026 వరకు సాగే ఈ జాతీయ స్మారక కార్యక్రమం, భారత స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణనిచ్చి, నేటికీ జాతీయ గర్వం, ఐక్యతను రేకెత్తిస్తూనే ఉన్న ఈ అనాదిగా ఉన్న కూర్పు 150 సంవత్సరాలను జరుపుకుంటుంది.