Page Loader
మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

వ్రాసిన వారు Stalin
May 09, 2023
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ ఐఐడీ, ట్రీఐటీ, ఎన్ఐటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తరలించింది. రెండు ప్రత్యేక విమానాల్లో 163మంది విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చింది. విద్యార్థులు సోమవారం మణిపూర్ నుంచి నేరుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులను వారి స్వస్థలాలకు తరలించడానికి APSRTC బస్సులను ఆయా మార్గాల్లో ఏర్పాటు చేశారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులు తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు.

ఆంధ్రప్రదేశ్

జీవితంపై ఆశను కోల్పోయాం: ఎన్ఐటీ మణిపూర్‌ విద్యార్థిని జాహ్నవి

అయితే కొంత మంది విద్యార్థులు కోల్‌కతా విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి తమ ఇళ్లకు చేరుకోవడానికి క్యాబ్‌లు, రైళ్లు, బస్సులను ఆశ్రయించినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. మణిపూర్‌లో హింస నేపథ్యంలో ఇంటర్నెట్, ప్రజా రవాణా లేకపోవడంతో విద్యార్థులు గత కొన్ని రోజులుగా బాహ్య ప్రపంచంతో తమ సంబంధాన్ని కోల్పోయారు. ఎన్ఐటీ మణిపూర్‌లో చదవుతున్న కడపకు చెందిన జాహ్నవి ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. మణిపూర్‌లోని తమ క్యాంపస్ వెలుపల అల్లర్లు, నిరంతర పేలుళ్లు, కాల్పులతో జీవితంపై ఆశను కోల్పోయామని చెప్పారు. తాము ప్రశాంతంగా నిద్రపోయి దాదాపు ఆరు రోజులైనట్లు పేర్కొన్నారు. సకాలంలో సాయం చేసిన ప్రభుత్వానికి జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు.