LOADING...
Andhra News: 16వ ఆర్థిక సంఘం షాక్‌.. ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్‌ నిరాకరణ
16వ ఆర్థిక సంఘం షాక్‌.. ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్‌ నిరాకరణ

Andhra News: 16వ ఆర్థిక సంఘం షాక్‌.. ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్‌ నిరాకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లకు పైగా గడిచినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ గాడిలో పడలేదు. ఈ నేపథ్యంలో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి మళ్లీ రెవెన్యూ లోటు గ్రాంట్‌ను మంజూరు చేస్తుందన్న ఆశలను ప్రభుత్వం పెట్టుకుంది. ఆర్థిక సంఘం ఛైర్మన్‌, సభ్యులు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ విభజన తర్వాత ఎదురవుతున్న ఆర్థిక సమస్యలను అధికార యంత్రాంగం సమగ్రంగా వివరించింది. హైదరాబాద్‌ కోల్పోవడం వల్ల రాష్ట్ర ఆదాయ వనరులు ఎంతగా తగ్గిపోయాయో,పదేళ్లు గడిచినా ఆర్థిక పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదో గణాంకాలతో సహా వివరించింది. అయినప్పటికీ 16వ ఆర్థికసంఘం రెవెన్యూ లోటు గ్రాంట్‌ ఇవ్వాలన్న సిఫార్సును చేయలేదు.

వివరాలు 

ఐదేళ్ల కాలంలోనే రాష్ట్రానికి సుమారు రూ.30వేల కోట్ల మేర నష్టం

కనీసం మొదటి మూడు ఆర్థిక సంవత్సరాలైనా ఈ గ్రాంట్‌ మంజూరు చేయాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని కూడా ఆర్థిక సంఘం తిరస్కరించింది. 2014-15లో కాగ్‌ అంచనా వేసిన రెవెన్యూ లోటు ఆధారంగా,ఆ తర్వాత రెండు ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు మొత్తం 11ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.67వేల కోట్లను రెవెన్యూ లోటు గ్రాంట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసింది. ఏడాదికి సగటున రూ.6,000కోట్ల చొప్పున లెక్కిస్తే,ప్రస్తుత ఆర్థిక సంఘం పరిధిలోని ఐదేళ్ల కాలంలోనే రాష్ట్రానికి సుమారు రూ.30వేల కోట్ల మేర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యతను ఆర్థిక సంఘం సిఫార్సు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు 

సేవారంగం బలహీనత

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడే స్థితికి చేరింది. 2013-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 24 శాతం, పరిశ్రమలు 25 శాతం, సేవారంగం 51 శాతంగా ఉండేది. విభజన అనంతరం 2014-15లో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం వాటా 31 శాతంగా ఉండగా, తెలంగాణలో అది 16 శాతమే. పరిశ్రమల వాటా ఏపీలో 25 శాతం, తెలంగాణలో 22 శాతంగా ఉంది. అదే సేవారంగం వాటా ఏపీలో 44 శాతంగా ఉండగా, తెలంగాణలో 61 శాతానికి చేరింది. తాజా 2023-24 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం వాటా 34 శాతానికి పెరిగింది.

Advertisement

వివరాలు 

సేవారంగం బలహీనత

తెలంగాణలో అది 15 శాతంగా ఉంది. పరిశ్రమల రంగం వాటా ఏపీలో 24 శాతానికి తగ్గగా, తెలంగాణలో 18 శాతంగా నమోదైంది. కీలకమైన సేవారంగం వాటా మాత్రం ఏపీలో 42 శాతానికి పడిపోగా, తెలంగాణలో 67 శాతానికి పెరిగింది. ఆదాయం తీసుకొచ్చే పరిశ్రమలు, సేవారంగం రాష్ట్రంలో బలంగా స్థాపితం కాకపోవడంతో ప్రభుత్వానికి తగినంత రెవెన్యూ రాబడి సమకూరడం లేదని అధికారులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

రాజధాని లేకపోవడమే కారణం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ రాజధానిగా ఉన్న సమయంలో మౌలిక వసతులు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు అన్నీ అక్కడే కేంద్రీకృతమయ్యాయి. విభజన తర్వాత అవే వనరుల ఆధారంగా తెలంగాణకు కేవలం హైదరాబాద్‌ నుంచే సుమారు 75 శాతం సొంత ఆదాయం లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని లేకపోవడం ఆర్థిక పునర్నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా మారింది.

వివరాలు 

అప్పుల భారం పెరుగుదల

రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరులు తగ్గిపోవడంతో అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విభజన అనంతరం తీసుకున్న అప్పుల కారణంగా అసలు, వడ్డీ చెల్లింపుల భారం భారీగా పెరిగింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించలేదని,దాని ప్రభావంతో రాష్ట్రం కోలుకోలేని నష్టాన్ని చవిచూసిందని ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లింది.

వివరాలు 

విభజన తర్వాత కొంత మేర లోటు భర్తీ

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్‌ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రూ.16,078 కోట్ల రెవెన్యూ లోటు ఉందని గుర్తించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2014-15లో రూ.2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1,176.50 కోట్లు విడుదల చేసింది. ఈ మూడేళ్లలో కలిపి మొత్తం రూ.3,979 కోట్లు అందించింది. 2023లో అప్పటి రెవెన్యూ లోటుగా ఉన్న రూ.10,460.87 కోట్లను వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నారు. అదే విధంగా 15వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటును రూ.22,113 కోట్లుగా అంచనా వేసింది.

వివరాలు 

విభజన తర్వాత కొంత మేర లోటు భర్తీ

2015-16 నుంచి ఐదేళ్ల కాలంలో ఆ మొత్తాన్ని కేంద్రం పూర్తిగా భర్తీ చేసింది. 2020-21లో కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ఆర్థిక సంఘం నివేదిక ఇవ్వలేదు. ఆ ఒక్క ఏడాదికి కేంద్రం రూ.5,897 కోట్లు విడుదల చేసింది. 2021-26 మధ్యకాలానికి సంబంధించి రూ.30,497 కోట్ల రెవెన్యూ లోటును ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, వైసీపీ ప్రభుత్వం తొలి మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే ఆ మొత్తాన్ని పూర్తిగా తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement