TGSRTC Special Buses : సంక్రాంతి సందర్భంగా 1740 ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్ళిపోవడంతో, తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సుల సేవలను ఏర్పాటు చేస్తోంది.
విద్య, ఉద్యోగ, వ్యాపారం చేస్తున్న వారు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఈ నెల 11 నుండి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో, ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. కరీంనగర్ రీజియన్ నుంచి 7వ తేదీ నుండి 22 వరకు అదనపు బస్సులు నడపాలని నిర్ణయించారు.
ఈ ప్రత్యేక సర్వీసులలో 860 బస్సులతోపాటు, ఇతర డిపోల నుండి కూడా అదనపు బస్సులు తెప్పిస్తున్నారు.
Details
50శాతం అదనపు ఛార్జీలపై అసంతృప్తి
50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడానికి www.tgsrtcbus.in ను సందర్శించవచ్చు. ప్రయాణికులు 50 శాతం అదనపు ఛార్జీలు వెయ్యడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై ఆర్టీసీ సంస్థ స్పందించి, ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.