
Madhya Pradesh: టీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది. నర్సింగ్‌పూర్ జిల్లాలోని ఎక్సలెన్స్ స్కూల్‌లో చదువుకున్న 18 ఏళ్ల యువకుడు,ఒక మహిళా ఉపాధ్యాయురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో 26 ఏళ్ల టీచర్ గాయాలపాలయ్యారు. నిందితుడిని పోలీసులు సూర్యాంశ్ కొచార్‌గా గుర్తించారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీచర్ ధరించిన దుస్తులపై అభ్యంతరకర కామెంట్ చేశాడు. ఈ అంశంపై టీచర్ ఫిర్యాదు చేసింది. దీంతో పగ పట్టిన అతను పెట్రోల్ దాడికి ప్లాన్ చేశాడు.
వివరాలు
బాధితురాలికి 15 శాతం వరకు గాయాలు
ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. టీచర్ ఇంటికి వెళ్ళిన సూర్యాంశ్,తనతో పాటు పెట్రోల్ బాటిల్ తీసుకువెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయురాలిని తక్షణమే జిల్లా ఆసుపత్రికి తరలించారు. సుమారు 15 శాతం వరకు కాలిన గాయాలు ఉన్నాయని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెకు ప్రత్యేక చికిత్స అందుతున్నట్లు సమాచారం.
వివరాలు
టీచర్ పై వన్‌సైడెడ్ లవ్
నిందితుడు, ఉపాధ్యాయురాలికి గత రెండేళ్లుగా పరిచయం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే సూర్యాంశ్ ఆమెపై వన్‌సైడెడ్ లవ్ పెంచుకున్నాడు. కొన్ని నెలల క్రితం స్కూల్‌లో అతని ప్రవర్తనపై చర్యలు తీసుకుని, విద్యాసంస్థ నుంచి తొలగించారు.ప్రస్తుతం అతను మరొక పాఠశాలలో చదువుతున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీచర్ ధరించిన దుస్తులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, కక్ష పెంచుకున్న అతను పెట్రోల్ దాడికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు 124ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు. డోంగర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్యాణ్‌పుర్ గ్రామం నుంచి నిందిత విద్యార్థిని అరెస్టు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.