LOADING...
Bengaluru: రోజుకి 2,800 కొత్త వాహనాలు రోడ్లపైకి.. బెంగళూరులో ట్రాఫిక్‌కు కొత్త చిక్కు 
రోజుకి 2,800 కొత్త వాహనాలు రోడ్లపైకి.. బెంగళూరులో ట్రాఫిక్‌కు కొత్త చిక్కు

Bengaluru: రోజుకి 2,800 కొత్త వాహనాలు రోడ్లపైకి.. బెంగళూరులో ట్రాఫిక్‌కు కొత్త చిక్కు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి పండుగ సీజన్, అలాగే వాహనాలపై జీఎస్టీ తగ్గింపు కారణంగా ఈ అక్టోబర్ నెలలో బెంగళూరు రోడ్లపై కొత్త వాహనాలు భారీగా పెరిగాయి. రోజుకి సగటున 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్న నగరానికి ఇది మరో పెద్ద భారంలా మారింది. ఎందుకు ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి? ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారులు చెప్పినట్లు రెండు కారణాలు ప్రధానంగా ప్రభావితం చేశాయి: పండుగల కొనుగోలు కొన్ని వాహనాలపై జీఎస్టీ తగ్గింపు TOI వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత నెలతో పోల్చితే వాహనాల రిజిస్ట్రేషన్లు 46% వరకు పెరిగాయి.

వివరాలు 

మాసాల వారీగా రిజిస్ట్రేషన్ వివరాలు:

సెప్టెంబర్: 56,831 అక్టోబర్: 86,014 రోజువారీ సగటు రిజిస్ట్రేషన్లు కూడా సెప్టెంబర్‌లో 1,894 కాగా, అక్టోబర్‌లో 2,774కి పెరిగాయి. ఇది ఇటీవల సంవత్సరాల్లోనే అత్యధిక పెరుగుదలగా చెప్పొచ్చు. అధికంగా ద్విచక్రవాహనాలే కొత్త రిజిస్ట్రేషన్లలో ఎక్కువ శాతం బైకులు, స్కూటర్లు: రోజు 1,900 రెండు చక్ర వాహనాలు, 514 కార్లు ప్రస్తుతం బెంగళూరులో మొత్తం 1.2 కోట్ల రిజిస్ట్రర్ వాహనాలు ఉన్నాయి. అందులో: 83.8 లక్షలు - రెండు చక్ర వాహనాలు, 24 లక్షలు కార్లు

వివరాలు 

జీఎస్టీ తగ్గింపు కీలక పాత్ర

ఒక సీనియర్ ఆర్టీఓ అధికారి ప్రకారం,సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు అమ్మకాలపై నేరుగా మంచి ప్రభావం చూపింది. చాలా మంది కొనుగోలుదారులు పన్ను తగ్గింపు కోసం వేచి చూసి ఆ తర్వాతే వాహనాలు కొనుగోలు చేశారు. జీఎస్టీ 28% నుండి 18%కు తగ్గిన వాహనాలు: 350cc వరకూ ఉన్న బైకులు 1,200ccలోపు, 4 మీటర్ల పొడవు వరకు ఉన్న చిన్న పెట్రోల్ కార్లు 1,500ccలోపు చిన్న డీజిల్ కార్లు రాష్ట్రానికి కూడా లాభమే ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ యోగీష్ ఏఎం ప్రకారం,గత అక్టోబర్‌తో పోలిస్తే ఈసారి ట్రాన్స్‌పోర్ట్ శాఖ Rs 230 కోట్ల అదనపు ఆదాయం సాధించింది. అక్టోబర్ 2024 ఆదాయం: ₹1,157 కోట్లు,అక్టోబర్ 2025 ఆదాయం: ₹1,387 కోట్లు

వివరాలు 

వచ్చే ఆర్థిక సంవత్సర ₹15,000కోట్లు వసూలు  లక్ష్యం

అలాగే ₹10 లక్షల కంటే తక్కువ ధరలో ఉన్న కార్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే 4,000 వరకు పెరిగినట్లు ఆయన తెలిపారు. కర్ణాటకలో ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్ విభాగం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹15,000 కోట్లు వసూలు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.