Page Loader
Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం
మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన 'మహా కుంభమేళా'కు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు ఉదయం కేవలం 60 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహాకుంభమేళా వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో పెరుగుతాయన్నారు. ఒక్కో వ్యక్తి సగటున రూ.5 వేలు ఖర్చు చేసినా మొత్తం రూ.2 లక్షల కోట్లు అవుతుంది.

Details

రవాణా సేవల ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయం

హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక నివాసాలు, ఆహారం, వస్తువులు, ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు ఈ ఖర్చులో ఉంటాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖాండేవాల్ తెలిపారు. స్థానిక హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలి లాడ్జీల ద్వారా రూ.40 వేల కోట్ల ఆదాయం సాదించాలనుకుంటున్నారు. ప్యాకేజీ ఆహారం, నీరు, బిస్కెట్లు, జ్యూస్‌లు, భోజనం వంటి సరఫరాలతో రూ.20 వేల కోట్ల వ్యాపారం జరగనుంది. నూనె, దీపాలు, గంగా నీరు, దేవతా విగ్రహాలు, ధూపం వంటి పూజాసామగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో రూ.20 వేల కోట్లు లావాదేవీలు జరగవచ్చును. ప్రయాణికుల కోసం టాక్సీలు, సరకు రవాణా వంటి సేవల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం రానుంది

Details

40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం

టూరిస్ట్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీల ద్వారా రూ.10 వేల కోట్లు, మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద ఉత్పత్తులతో రూ.3 వేల కోట్లు, టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో రూ.1 వేల కోట్లు, మీడియాలో ప్రకటనలు, ప్రమోషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల వ్యాపారం జరగనుంది. 2019లో జరిగిన ఆర్ధిక కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.2 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఈసారి ఒక నెల పాటు సాగే మహాకుంభమేళాకు సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో యూపీకి భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.