
రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో కుల్గాం పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను చేధించారు. ఈ సందర్భంగా ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
ఈ ఆపరేషన్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు పిస్టల్స్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక యూబీజీఎల్, ఇతర మందుగుండు సామగ్రిని సీజ్ చేశారు.
అరెస్టు చేసిన ఉగ్రవాదులను ఆదిల్ హుస్సేన్ వనీ, సుహైల్ అహ్మద్ దార్, ఐత్మద్ అహ్మద్ లావే, మెహ్రాజ్ అహ్మద్ లోన్, సబ్జార్ అహ్మద్ ఖార్‌గా గురించారు.
వీరిపై ఖైమో పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బందిపొరాలో టెర్రర్ మాడ్యూల్‌ను పోలీసులు ఛేదించి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న ఇద్దరిని అరెస్టు చేసిన దాదాపు నెల తర్వాత ఈ పరిణామం జరిగింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తీవ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
Terror Module Busted In Jammu And Kashmir, 5 Lashkar Terrorists Arrested https://t.co/Wku6jVByZB pic.twitter.com/Fw2x2CVVKn
— NDTV News feed (@ndtvfeed) September 24, 2023