LOADING...
Year Ender 2025: 2025లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో మైలురాళ్లు ఇవే.. 
2025లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో మైలురాళ్లు ఇవే..

Year Ender 2025: 2025లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో మైలురాళ్లు ఇవే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో ఒక ప్రత్యేక మైలురాయి గా నిలిచింది. ప్రభుత్వం 'స్పీడ్ ఆఫ్ బిజినెస్' విధానాన్ని అవలంబించడంతో, రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు కొత్త వేగంతో ముందుకు సాగాయి.

వివరాలు 

అమరావతి అభివృద్ధి వేగం

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు ప్రస్తుతం పూర్తి జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు మరింత వేగాన్ని అందుకున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమం అమరావతిని వరల్డ్-క్లాస్ గ్రీన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో కొనసాగుతోంది. సెక్రటేరియట్,హైకోర్టు భవనం,అసెంబ్లీ, 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, రిజర్వాయర్లు వంటి ప్రధాన నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. కోర్ క్యాపిటల్ భవనాలు 2028 వరకు పూర్తి అయ్యేలా ప్రణాళికలు ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ నుండి రెండో విడతగా సుమారు రూ.1,700 కోట్లు డిసెంబర్‌లో విడుదల చేయనుంది. మొత్తం ఫేజ్-1 పనులు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి $1,600 మిలియన్ నిధులతో కొనసాగుతున్నాయి.

వివరాలు 

విశాఖపట్నం: గూగుల్ ఏఐ హబ్

అక్టోబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐజీబీసీ (IGBC) నెట్ జీరో సర్టిఫికేషన్ పొందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను ప్రారంభించారు. అలాగే, రాజధాని ప్రాంతంలో రూ.50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా సీఆర్డీఏ (CRDA) ప్రణాళికలు సిద్ధం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ తన AI హబ్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది. గూగుల్ తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో విస్తరిస్తోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల AI పవర్డ్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ను దశలవారీగా ఏర్పాటు చేయనుంది. దీని కోసం మొత్తం లక్షన్నర కోట్ల పెట్టుబడి చేసేలా ప్రణాళికలు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

విశాఖ CII ఇన్వెస్టర్స్ సమ్మిట్: రూ.13.2 లక్షల కోట్ల పెట్టుబడులు

ఇది భారతదేశంలో గూగుల్‌కు అతిపెద్ద పెట్టుబడి గా నిలుస్తూ, లక్షలాది ఉద్యోగాలను సృష్టించి విశాఖను ఏఐ హబ్ గా మార్చనుంది. నవంబర్ 2025లో విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడుల సమావేశంగా నిలిచింది. రెండు రోజులలోనే 640 ఎంఓయూల ద్వారా రూ.13.2 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు వచ్చాయి. దీని ద్వారా సుమారు 16 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని అంచనా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: 90% పూర్తి ఉత్తరాంధ్ర ఆర్థిక పరిధిని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2025 చివరి వరకు 90% పూర్తి చేసుకుంది. డిసెంబర్‌లో విజయవంతమైన వ్యాలిడేషన్ ఫ్లైట్ ట్రయల్స్ తర్వాత, 2026 ప్రథమార్ధంలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది.

Advertisement

వివరాలు 

రిలయన్స్ AI సెంటర్: రూ.93,000 కోట్ల పెట్టుబడి

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దాదాపు $11 బిలియన్ల (రూ.93,000 కోట్లు) పెట్టుబడితో రూపొందే ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త దిశను ఇవ్వనుంది. దేశంలో మొట్టమొదటి 'క్వాంటం కంప్యూటింగ్' కేంద్రం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.1 లక్ష కోట్ల నిధులతో, ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశపు మొదటి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇది రాష్ట్రాన్ని భవిష్యత్ టెక్నాలజీ హబ్ గా నిలబెట్టనుంది.

వివరాలు 

ఎవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభం

భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో 136 ఎకరాల్లో జీఎంఆర్-మాన్సాస్ ఎవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభించబడింది. అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారుచేయడానికి లక్ష్యంగా ఉన్న ఈ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్‌ను విమానయాన శిక్షణలో గ్లోబల్ సెంటర్ గా మార్చనుంది. సెమీకండక్టర్ సెంటర్: రూ.765 కోట్ల ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీమ్ కింద, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.765 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఆమోదించింది.

వివరాలు 

SIPB ద్వారా రూ.1.01 లక్షల కోట్ల ఆమోదాలు

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 2025లో జరిగిన సమావేశాల్లో 26 పెద్ద పరిశ్రమలకు ఆమోదం ఇచ్చింది. వీటి ద్వారా లక్షలాది నేరుగా మరియు పరోక్షంగా ఉద్యోగాలు కల్పించబడతాయి. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఆలస్యం లేకుండా అందించేందుకు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఆటోమేటిక్ ఎస్క్రో సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచింది.

Advertisement