Page Loader
ICSE Results : 2025 ICSE, ISC ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!
2025 ICSE, ISC ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!

ICSE Results : 2025 ICSE, ISC ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 సంవత్సరానికి సంబంధించిన ఐసీఎస్‌ఈ (ICSE) 10వ తరగతి, ఐఎస్‌సీ (ISC) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) బుధవారం ఉదయం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 18న ప్రారంభమై మార్చి 27 వరకు కొనసాగాయి. ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించారు. పరీక్షలు పూర్తైన కొన్ని వారాల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషం.

Details

యూనిక్ ఐడీ పాటు క్యాప్చా కడ్ ను ఎంటర్ చేయాలి

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లైన cisce.org](https://cisce.org), [results.cisce.org](https://results.cisce.org)లో పరిశీలించవచ్చు. ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ యూనిక్ ఐడీ (రోలు నంబర్)తో పాటు స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫలితాలపై ఎలాంటి సందేహాలు ఉంటే సంబంధిత పాఠశాలల ఆధ్వర్యంలో చెక్ చేసుకోవచ్చు.