LOADING...
AP: పుత్తూరు, కర్నూలు, విశాఖపట్నం వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్‌ సీట్లు
పుత్తూరు, కర్నూలు, విశాఖపట్నం వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్‌ సీట్లు

AP: పుత్తూరు, కర్నూలు, విశాఖపట్నం వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్‌ సీట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత విద్యా సంవత్సరంలో,ఏపీలోని అనేక ప్రైవేట్ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ అదనంగా 250ఎంబీబీఎస్‌ సీట్లకు కొత్త అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 13న,పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాలలో 100 సీట్లు 150కి పెంచారు.అదే విధంగా,కర్నూలు శాంతిరామ్ వైద్య కళాశాలలో 150సీట్లు 200కి పెరిగాయి. తాజాగా,గురువారం విశాఖపట్టణం ఎన్నారై వైద్య కళాశాలలో ఉన్న 150ఎంబీబీఎస్‌ సీట్లు 250కి పెంచే అనుమతులు జారీ అయ్యాయి. అదేవిధంగా,కర్నూలు శాంతిరామ్ వైద్య కళాశాలలో ఇప్పటికే 200కి పెంచిన సీట్లు మళ్లీ 250కి పెరిగాయి. పెరుగుతున్న సీట్లకు సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ (LOP) రావాల్సి ఉంది.విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకారం,ఈ సీట్లను మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది.