Tahawwur Rana: ఢిల్లీ AIIMSలో తహవ్వూర్ రాణాకు శస్త్రచికిత్స
ఈ వార్తాకథనం ఏంటి
2008 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రానా(Tahawwur Rana) దిల్లీలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. మే 4న ఎయిమ్స్'లో హెర్నియా ఆపరేషన్ జరిగింది. 65 ఏళ్ల రాణా ప్రస్తుతం తిహార్ జైలు హై సెక్యూరిటీ వార్డులో ఉన్నాడు. గత ఏడాది అమెరికా నుంచి భారత్‌కు ఎక్స్‌ట్రడిషన్ అనంతరం అతడిని ఇక్కడే నిర్బంధించారు. ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజున శస్త్రచికిత్స చేశారు. గత నెలలోనే రాణా ఐదు సార్లు AIIMS ఆస్పత్రిని సందర్శించినట్టు సమాచారం. మార్చి 31, ఏప్రిల్ 6, 7, 20, 21 తేదీల్లో డాక్టర్లు పరిశీలించి చివరికి ఆపరేషన్‌కు నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
ఢిల్లీ పోలీసులు ప్రత్యేక భద్రత
శస్త్రచికిత్స తర్వాత అతడు కోలుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆస్పత్రికి తరలించే సమయంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. న్యాయపరమైన నిర్బంధ రక్షణ విభాగం(NAV) సిబ్బంది అతడిని ఎస్కార్ట్ చేయగా, వార్డ్ బయట అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిహార్ జైల్లో ఖైదీ నంబర్ 1784గా ఉన్న రాణా, మరో ఆరుగురు హై రిస్క్ ఖైదీలతో కలిసి ప్రత్యేక బ్లాక్‌లో ఉంటున్నాడు. 26/11 దాడులకు ముందు రీకానైసెన్స్ చేసిన డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముంబైపై దాడి చేసిన ఉగ్రవాదులకు కీలక లాజిస్టికల్ సపోర్ట్ అందించిన కుట్రలో భాగమయ్యాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.