Loading...
British Airways: హైదరాబాద్‌-లండన్‌ విమానంలో ముగ్గురు పైలట్ల అస్వస్థత.. దర్యాప్తు ప్రారంభం
హైదరాబాద్‌-లండన్‌ విమానంలో ముగ్గురు పైలట్ల అస్వస్థత.. దర్యాప్తు ప్రారంభం

British Airways: హైదరాబాద్‌-లండన్‌ విమానంలో ముగ్గురు పైలట్ల అస్వస్థత.. దర్యాప్తు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన BA276 విమానంలో ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. విమానం సుమారు 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక పైలట్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనకు అత్యవసరంగా ఆక్సిజన్ అందించారు. ఈ ఘటనను బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ తీవ్రంగా పరిగణించి అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం,హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ఒక పైలట్ ఆరోగ్య సమస్యతో విధులు నిర్వహించలేని పరిస్థితికి చేరుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆక్సిజన్ అందించారు. అదే సమయంలో మరో ఇద్దరు పైలట్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

వివరాలు 

హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పైలట్స్ అల్పాహారం

అయినప్పటికీ వారు విమానాన్ని నియంత్రిస్తూ సురక్షితంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు.

ప్రయాణం కొనసాగుతున్న సమయంలో వారి ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై స్పందించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్‌,తమ ఉద్యోగుల సంక్షేమమే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.

అదే సమయంలో ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది.

పైలట్లకు ఎదురైన ఆరోగ్య సమస్యలకు గల కారణాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని సంస్థ వెల్లడించింది.

విమానం లండన్‌కు చేరుకున్న అనంతరం ముగ్గురు పైలట్లకు అవసరమైన వైద్య చికిత్స అందించినట్లు సమాచారం.

కాగా,వారు ప్రయాణానికి ముందు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అల్పాహారం చేసినట్లు తెలిసింది.

దీంతో ఫుడ్‌ పాయిజినింగ్‌ కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానంతో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT