
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ లో మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. మంగళవారం దంతెవాడ జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ మకాం వేసినట్లు సమాచారం అందడంతో, సంయుక్త భద్రతా బలగాలు ఉదయం నుంచే అడవుల్లో యాంటీ-నక్సల్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
వివరాలు
కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటనాస్థలంలో మూడు మృతదేహాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. గడిచిన మార్చి 20న భారీ ఎన్‌కౌంటర్లు జరిగిన సంగతి తెలిసిందే.
బీజాపుర్-కాంకేర్ జిల్లాల్లో జరిగిన ఈ కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మరణించారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో 90 మంది వరకు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.