
Ayodhya: అయోధ్య రామమందిర మార్గంలో భారీ చోరీ
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
భక్తులు అయోధ్యలోని రామమందిరానికి చేరుకునే మార్గాలైన భక్తిపథ్, రామపథ్ మార్గాల్లో అమర్చిన 3,800 బాంబో లైట్లు, 36 గోబో ప్రొజెక్టర్లు కనిపించకుండా పోయాయని పీటీఐ నివేదించింది.
వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉన్నట్లు సమాచారం.
అయోధ్యలో ఒక కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
రామ్ పథ్ మార్గంలో లైట్లను అమర్చే కాంట్రాక్ట్‌ను అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ యష్ ఎంటర్‌ప్రైజస్, కృష్ణ ఆటో మొబైల్స్ సంస్థలకు అప్పగించింది.
ఇక రామ్‌పథ్‌లో 6,400 బాంబో లైట్లు, భక్తి పథ్‌లో 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను ఏర్పాటు చేశారు.
అయితే మే 9 తర్వాత 6,400 బాంబో లైట్లతో 3,800 బాంబో లైట్లు చోరికి గురైనట్లు ఆ సంస్థ ప్రతినిధులు గుర్తించారు.
చోరీ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి శేఖర్ వర్మ ఆగస్టు 9న రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.