Uttam Kumar Reddy: రేషన్ కార్డుల ద్వారా 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రేషన్ కార్డుల విషయంలో వారు తగిన దృష్టి పెట్టలేదని మండిపడ్డారు.
కొత్త రేషన్ కార్డులు తీసుకువచ్చి 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. రేషన్ దుకాణాల్లో ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు కూడా చెప్పారు.
వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయయోగ్యమైన భూములపై ఏటా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నామని ఉత్తమ్ వెల్లడించారు.
Details
వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం
భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన విధానమని ఆయన పేర్కొన్నారు.
నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇస్తూ, ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టంచేశారు.