LOADING...
Jurala Project: జూరాలకు భారీగా వరద.. 42 గేట్లు ఎత్తివేత
జూరాలకు భారీగా వరద.. 42 గేట్లు ఎత్తివేత

Jurala Project: జూరాలకు భారీగా వరద.. 42 గేట్లు ఎత్తివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌పై భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం, జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడం కారణంగా ప్రాజెక్ట్‌కు 3.42 లక్షల క్యూసెక్కుల నీటిప్రమాణం చేరుతోంది. ఈ పరిస్థితిలో అధికారులు 42 గేట్లను పూర్తి‌గా ఎత్తి, 3.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 318.51 మీటర్లుగా ఉంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 8.790 టీఎంసీలు నీరు నిల్వగా ఉంది.

వివరాలు 

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కి వరద ప్రవాహం 

ఇక శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కి వరద ప్రవాహం కొనసాగుతోంది.ప్రాజెక్ట్‌కి 3,57,333 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు 10 గేట్లను 5 అడుగుల మేర, 16 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, సమాన పరిమాణంలో నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో ఎడమ, కుడి విద్యుత్‌ ప్లాంట్లలో కరెంట్ ఉత్పత్తి సాధారణంగా కొనసాగుతోంది. సాగర్‌ ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ 590 అడుగులు, ప్రస్తుతం 586.70 అడుగులు నిల్వగా ఉన్నాయి. మొత్తం 312 టీఎంసీల నీరు నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 303.94 టీఎంసీలు నీరు నిల్వగా ఉంది.