LOADING...
Sri Satyasai: పారిశ్రామిక పార్కుకు 439 ఎకరాల కేటాయింపు.. వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి 
వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి

Sri Satyasai: పారిశ్రామిక పార్కుకు 439 ఎకరాల కేటాయింపు.. వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి చెందిన ఆర్. అనంతపురం గ్రామంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి 439.27 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర సచివాలయంలో వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం కోసం పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

వివరాలు 

కొత్తగా నూర్‌బాషా/దూదేకుల ఆర్థిక సంస్థ 

ఇప్పటి వరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న నూర్‌బాషా/దూదేకుల సంక్షేమ,అభివృద్ధి సంస్థను రద్దు చేసి,దాని స్థానంలో 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్‌బాషా/దూదేకుల ఆర్థిక సంస్థ'అనే పేరుతో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిమండలి ప్రకటించింది. మంత్రిమండలి నిర్ణయాలు ఇవే.. విద్యుత్ ప్రాజెక్టుల అమలు: నంద్యాల జిల్లా అవుకు ప్రాంతంలో ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ ద్వారా 800మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. అలాగే,డోన్ పశ్చిమప్రాంతంలో రీన్యూ విక్రం శక్తి అనే సంస్థ ద్వారా 600మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రిమండలి అనుమతి ఇచ్చింది. అదే ప్రాంతంలో రీన్యూ వ్యోమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 300మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టు కోసం సవరించిన అనుమతులను మంజూరు చేసింది.

వివరాలు 

ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ ప్రణాళిక మార్పులు: 

ఎంఐజీ లేఅవుట్ల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్ని నిర్దిష్టమైన మార్పులను మంత్రిమండలి ఆమోదించింది. బీసీ బాలికల పాఠశాలకు భూమి కేటాయింపు: నంద్యాల జిల్లా బనగానపల్లెలోని మార్కెట్ యార్డు దక్షిణ భాగంలో ఉన్న 5.97 ఎకరాల భూమిని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, వసతిగృహ నిర్మాణానికి కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించింది.