Andra Pradesh: ఏపీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల నిధులు
ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్‌లో ఉన్న రూ.25 కోట్లను అందించింది. ఈ నిధులను 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు కేటాయించనున్నారు. ఈ నిధులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సంబంధిత శాఖల ద్వారా ఖర్చు చేయనుంది.
11 షెడ్యూల్ ఆధారంగా గ్రాంట్స్
రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ఆధారంగా కేంద్రం రాష్ట్రాలకు గ్రాంట్స్ విడుదల చేస్తోంది. టైడ్ గ్రాంట్స్‌ను ఓడీఎఫ్, పారిశుద్ధ్యం, నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, మురికినీటి రీసైక్లింగ్, ఇంటి నుంచి వ్యర్థాలు శుద్ధి చేయడంలో వినియోగించాలి. అన్‌టైడ్ గ్రాంట్స్‌ను పారిశుద్ధ్యం, విద్య, వ్యవసాయం, గ్రామాల్లో గృహ నిర్మాణం వంటి పనుల కోసం వినియోగించాలి.